Thursday, January 30, 2014

4. శ్రీ రాముల దివ్యనామ - Sree raamula divyanaama

YouTube link : Goshtiganam
పల్లవి
శ్రీ రాముల దివ్యనామ స్మరణ జేయుచున్న జాలు ఘోరమైన తపములను ఘోర నేటికే మనసా

అనుపల్లవి
తారక శ్రీ రామ నామ ధ్యానము జేసిన జాలు వేరు వేరు దైవములను వెదుక నేటికే మనసా

చరణములు
1.భాగవతుల పాద జలము పైన చల్లుకొన్న జాలు భాగీరథికి పొయ్యేననే
భ్రాంతియేటికే మనసా భాగవతుల వాగమ్ర్తము పానము జేసిన జాలు బాగు మీరినట్టి అమ్ర్త పానమేటికె మనసా

2.పరుల హింస సేయకున్న పరమ ధర్మమంతే చాలు పరులను రక్శింతునని పల్కనేటికే
మనసా దొరకని పరుల ధనము దోచకయుణ్డితే చాలు గురుతుగాను గోపురము గట్టనేటికె మనసా

3.పరగ దీనజనులయందు పక్శముంచినదే చాలు పరమాత్మునియందు బ్రీతి బెట్టనేటికే
మనసా హరిదాసులకు పూజ లాచరించిను చాలు హరిని పూజసేతుననే యహ మ దేటికే మనసా

4.జప తపానుశ్ఠానములు సలిపిరి మూడులకై బుధులు జగదీషుని దివ్యనామ చింతన
కోసరమై మనసా సఫలము లేక యే వేళ జిందించే మహాత్ములకు జప తపానుశ్ఠానములు సేయనేటికే మనసా

5.అతిథి వచ్చి యాకలన్న యన్న మింత ఇడిన జాలు క్రతువు సేయ వలయు ననే
కాక్శయేటికే మనసా సతతము మా భద్రగిరి స్వామి రామదాసుడైన ఇతర మతములని యేటి వతల దేటికే మనసా

pallavi
Sree raamula divyanaama smaraNa jaeyuchunna jaalu ghOramaina tapamulanu ghOra naeTikae manasaa

anupallavi
taaraka Sree raama naama dhyaanamu jaesina jaalu vaeru vaeru daivamulanu veduka naeTikae manasaa

charaNamulu
1.bhaagavatula paada jalamu paina challukonna jaalu bhaageerathiki poyyaenanae
bhraaMtiyaeTikae manasaa bhaagavatula vaagamrtamu paanamu jaesina jaalu baagu meerinaTTi amrta paanamaeTike manasaa

2.parula hiMsa saeyakunna parama dharmamaMtae chaalu parulanu rakSiMtunani palkanaeTikae
manasaa dorakani parula dhanamu dOchakayuNDitae chaalu gurutugaanu gOpuramu gaTTanaeTike manasaa

3.paraga deenajanulayaMdu pakSamuMchinadae chaalu paramaatmuniyaMdu breeti beTTanaeTikae
manasaa haridaasulaku pooja laachariMchinu chaalu harini poojasaetunanae yaha ma daeTikae manasaa

4.japa tapaanuSThaanamulu salipiri mooDulakai budhulu jagadeeshuni divyanaama chiMtana
kOsaramai manasaa saphalamu laeka yae vaeLa jiMdiMchae mahaatmulaku japa tapaanuSThaanamulu saeyanaeTikae manasaa

5.atithi vachchi yaakalanna yanna miMta iDina jaalu kratuvu saeya valayu nanae
kaakSayaeTikae manasaa satatamu maa bhadragiri svaami raamadaasuDaina itara matamulani yaeTi vatala daeTikae manasaa

Wednesday, January 29, 2014

3. పలుకే బంగారమాయెనా, కోదండపాణి - palukae baMgaaramaayenaa

YouTube link : Mangalampalli Balamuralikrishna
YouTube link : Malladi Brothers
పల్లవి
పలుకే బంగారమాయెనా, కోదండపాణి

చరణములు
1.పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ

2.ఎంత వేడినగాని సుంతైన దయరాదు
పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ

3.ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ

4.రాతి నాతిగ చేసి భూ తలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ

5.శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా
కరుణించు భద్రాచల వరరామదాస పోష

pallavi
palukae baMgaaramaayenaa, kOdaMDapaaNi

charaNamulu
1.palukae baMgaaramaaye pilachinaa palukavaemi
kalalO nee naamasmaraNa maruva chakkani taMDree

2.eMta vaeDinagaani suMtaina dayaraadu
paMtamu saeya naeneMtaTivaaDanu taMDree

3.iravuga isukalOna poralina uDuta bhaktiki
karuNiMchi brOchitivani nera nammitini taMDree

4.raati naatiga chaesi bhoo talamuna
prakhyaati cheMditivani preetitO nammiti taMDree

5.SaraNaagatatraaNa birudaaMkituDavukaadaa
karuNiMchu bhadraachala vararaamadaasa pOsha

2.శ్రీరామ నామమే జిహ్వకు - SrI rAma nAmamE jihvaku

YouTube Video : Malladi Brothers
ప   శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది
     శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది  
చ 1)ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము
     జేరకుండ నాపదలను చెండేనన్నది         ||శ్రీరామ|| 
   2)దారి తెలియని యమదూతల తరిమేనన్నది 
     శ్రీమన్నారాయణ దాసులకు చెలువైయున్నది  ||శ్రీరామ|| 
   3)మాయావాదుల పొందు మానుమన్నది -యీ 
     కాయ మస్థిరమని తలపోయుచున్నది         ||శ్రీరామ|| 
   4)వదలని దుర్విషయ వాంచ వదలమన్నది -నా
     మదిలో హరి భజన సంపత్కరమైయున్నది   ||శ్రీరామ|| 
   5)ముక్తిమార్గమునకిది మూలమన్నది -వి
     రక్తుడు భద్రాచల రామదాసు డన్నది     ||శ్రీరామ||   

pa   Sreeraama naamamae jihvaku sthiramai yunnadi
     Sreeraamula karuNayae lakshmeekaramai yunnadi  
cha 1)ghOramaina paatakamulu goTTaenannadi mammu
     jaerakuMDa naapadalanu cheMDaenannadi         ||Sreeraama|| 
   2)daari teliyani yamadootala tarimaenannadi 
     SreemannaaraayaNa daasulaku cheluvaiyunnadi  ||Sreeraama|| 
   3)maayaavaadula poMdu maanumannadi -yee 
     kaaya masthiramani talapOyuchunnadi         ||Sreeraama|| 
   4)vadalani durvishaya vaaMcha vadalamannadi -naa
     madilO hari bhajana saMpatkaramaiyunnadi   ||Sreeraama|| 
   5)muktimaargamunakidi moolamannadi -vi
     raktuDu bhadraachala raamadaasu Dannadi     ||Sreeraama||   

1.అదిగో భద్రాద్రీ గౌతమి - adigO bhadrAdri

YouTube link : Malladi Brothers
YouTube link : Mangalampalli Balamuralikrishna 
  అదిగో భద్రాద్రీ గౌతమి
   ఇదిగో చుడండి   ||అదిగో భద్రాద్రీ||

చ 1)ముదముతో సీతా ముదిత లక్ష్మణుడు
     కదసి కొలువుగా రఘుపతియుండెడి  ||అదిగో భద్రాద్రీ||
   2)చారు స్వర్ణ ప్రాకార గోపుర
     ద్వారములతో సుందరమై యుండెడి    ||అదిగో భద్రాద్రీ||
   3)అనుపమానమై అతి సుందరమై
     తనదు చక్రమై ధగధగ మెరిసెడి ||అదిగో భద్రాద్రీ||
   4)కలియుగమందున నిలవైకుంఠము 
     అలరుచున్నది నయముగ మ్రొక్కెడి      ||అదిగో భద్రాద్రీ||
   5)శ్రీకర ముగనిల రామదాసుని 
     ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము     ||అదిగో భద్రాద్రీ||
     

   adigO bhadraadree gautami
   idigO chuDaMDi   ||adigO bhadraadree||

cha 1)mudamutO seetaa mudita lakshmaNuDu
     kadasi koluvugaa raghupatiyuMDeDi  ||adigO bhadraadree||
   2)chaaru svarNa praakaara gOpura
     dvaaramulatO suMdaramai yuMDeDi    ||adigO bhadraadree||
   3)anupamaanamai ati suMdaramai
     tanadu chakramai dhagadhaga meriseDi ||adigO bhadraadree||
   4)kaliyugamaMduna nilavaikuMThamu 
     alaruchunnadi nayamuga mrokkeDi      ||adigO bhadraadree||
   5)Sreekara muganila raamadaasuni 
     praakaTamuga brOchae prabhuvaasamu     ||adigO bhadraadree||