Thursday, January 30, 2014

4. శ్రీ రాముల దివ్యనామ - Sree raamula divyanaama

YouTube link : Goshtiganam
పల్లవి
శ్రీ రాముల దివ్యనామ స్మరణ జేయుచున్న జాలు ఘోరమైన తపములను ఘోర నేటికే మనసా

అనుపల్లవి
తారక శ్రీ రామ నామ ధ్యానము జేసిన జాలు వేరు వేరు దైవములను వెదుక నేటికే మనసా

చరణములు
1.భాగవతుల పాద జలము పైన చల్లుకొన్న జాలు భాగీరథికి పొయ్యేననే
భ్రాంతియేటికే మనసా భాగవతుల వాగమ్ర్తము పానము జేసిన జాలు బాగు మీరినట్టి అమ్ర్త పానమేటికె మనసా

2.పరుల హింస సేయకున్న పరమ ధర్మమంతే చాలు పరులను రక్శింతునని పల్కనేటికే
మనసా దొరకని పరుల ధనము దోచకయుణ్డితే చాలు గురుతుగాను గోపురము గట్టనేటికె మనసా

3.పరగ దీనజనులయందు పక్శముంచినదే చాలు పరమాత్మునియందు బ్రీతి బెట్టనేటికే
మనసా హరిదాసులకు పూజ లాచరించిను చాలు హరిని పూజసేతుననే యహ మ దేటికే మనసా

4.జప తపానుశ్ఠానములు సలిపిరి మూడులకై బుధులు జగదీషుని దివ్యనామ చింతన
కోసరమై మనసా సఫలము లేక యే వేళ జిందించే మహాత్ములకు జప తపానుశ్ఠానములు సేయనేటికే మనసా

5.అతిథి వచ్చి యాకలన్న యన్న మింత ఇడిన జాలు క్రతువు సేయ వలయు ననే
కాక్శయేటికే మనసా సతతము మా భద్రగిరి స్వామి రామదాసుడైన ఇతర మతములని యేటి వతల దేటికే మనసా

pallavi
Sree raamula divyanaama smaraNa jaeyuchunna jaalu ghOramaina tapamulanu ghOra naeTikae manasaa

anupallavi
taaraka Sree raama naama dhyaanamu jaesina jaalu vaeru vaeru daivamulanu veduka naeTikae manasaa

charaNamulu
1.bhaagavatula paada jalamu paina challukonna jaalu bhaageerathiki poyyaenanae
bhraaMtiyaeTikae manasaa bhaagavatula vaagamrtamu paanamu jaesina jaalu baagu meerinaTTi amrta paanamaeTike manasaa

2.parula hiMsa saeyakunna parama dharmamaMtae chaalu parulanu rakSiMtunani palkanaeTikae
manasaa dorakani parula dhanamu dOchakayuNDitae chaalu gurutugaanu gOpuramu gaTTanaeTike manasaa

3.paraga deenajanulayaMdu pakSamuMchinadae chaalu paramaatmuniyaMdu breeti beTTanaeTikae
manasaa haridaasulaku pooja laachariMchinu chaalu harini poojasaetunanae yaha ma daeTikae manasaa

4.japa tapaanuSThaanamulu salipiri mooDulakai budhulu jagadeeshuni divyanaama chiMtana
kOsaramai manasaa saphalamu laeka yae vaeLa jiMdiMchae mahaatmulaku japa tapaanuSThaanamulu saeyanaeTikae manasaa

5.atithi vachchi yaakalanna yanna miMta iDina jaalu kratuvu saeya valayu nanae
kaakSayaeTikae manasaa satatamu maa bhadragiri svaami raamadaasuDaina itara matamulani yaeTi vatala daeTikae manasaa

No comments:

Post a Comment