శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది
చ 1)ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము
జేరకుండ నాపదలను చెండేనన్నది ||శ్రీరామ||
2)దారి తెలియని యమదూతల తరిమేనన్నది
శ్రీమన్నారాయణ దాసులకు చెలువైయున్నది ||శ్రీరామ||
3)మాయావాదుల పొందు మానుమన్నది -యీ
కాయ మస్థిరమని తలపోయుచున్నది ||శ్రీరామ||
4)వదలని దుర్విషయ వాంచ వదలమన్నది -నా
మదిలో హరి భజన సంపత్కరమైయున్నది ||శ్రీరామ||
5)ముక్తిమార్గమునకిది మూలమన్నది -వి
రక్తుడు భద్రాచల రామదాసు డన్నది ||శ్రీరామ||
pa Sreeraama naamamae jihvaku sthiramai yunnadi
Sreeraamula karuNayae lakshmeekaramai yunnadi
cha 1)ghOramaina paatakamulu goTTaenannadi mammu
jaerakuMDa naapadalanu cheMDaenannadi ||Sreeraama||
2)daari teliyani yamadootala tarimaenannadi
SreemannaaraayaNa daasulaku cheluvaiyunnadi ||Sreeraama||
3)maayaavaadula poMdu maanumannadi -yee
kaaya masthiramani talapOyuchunnadi ||Sreeraama||
4)vadalani durvishaya vaaMcha vadalamannadi -naa
madilO hari bhajana saMpatkaramaiyunnadi ||Sreeraama||
5)muktimaargamunakidi moolamannadi -vi
raktuDu bhadraachala raamadaasu Dannadi ||Sreeraama||
No comments:
Post a Comment