పల్లవి
ఏడనున్నాడో భద్రాద్రి వాసుడే డనున్నాడో
చరణములు
1.ఏడనున్నాడో జాడ తెలియరాదు నాడు గజేంద్రునికీడు బాపిన స్వామి
2.ద్రౌణి బాణజ్వాల దాకిన బాలునికి ప్రాణమిచ్చిన జగత్రాణ రక్షకుడు
3.పాంచాలి సభలోన భంగమొందిన నాడు వంజన లేకను వలువచ్చిన తండ్రి
4.దుర్వాసు డుగ్రముతో ధర్మసుతుని జూడ నిర్వహించిన నవనీత చోరకుడు
5.అక్షయముగ శ్రీ భద్రాచలమందున సాక్షాత్కరించిన జగదేక వీరుడు
pallavi
aeDanunnaaDO bhadraadri vaasuDae DanunnaaDO
charaNamulu
1.aeDanunnaaDO jaaDa teliyaraadu naaDu gajaeMdrunikeeDu baapina svaami
2.drauNi baaNajvaala daakina baaluniki praaNamichchina jagatraaNa rakshakuDu
3.paaMchaali sabhalOna bhaMgamoMdina naaDu vaMjana laekanu valuvachchina taMDri
4.durvaasu DugramutO dharmasutuni jooDa nirvahiMchina navaneeta chOrakuDu
5.akshayamuga Sree bhadraachalamaMduna saakshaatkariMchina jagadaeka veeruDu