Monday, January 19, 2015

8.takkuvaemi manaku - తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు

పల్లవి:
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు త..
ప్రక్కతోడుగా భగవంతుడు తన
చక్రధారియై చెంతనె యుండగ త..
చరణము(లు):
మ్రుచ్చుసోమకుని మునుజంపినయా - మత్స్యమూర్తి మనపక్షమునుండగ త..
సురలకొరకు మందరగిరి మోసిన - కూర్మావతారుని కృప మనకుండగ త..
దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన - వరాహమూర్తి మనవాడై యుండగ త..
హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా - పరచిన నరహరి ప్రక్కన నుండగ త..
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన - వామనుండు మనవాడై యుండగ త..
ధరలో క్షత్రియులను దండించిన -  పరశురాముని దయ మనకుండగ త..
దశగ్రీవు మును దండించిన యా -  దశరథరాముని దయ మనకుండగ త..
ఇలలో యదుకులమున నుదయించిన - బలరాముడు మన బలమైయుండగ త..
దుష్టకంసుని ద్రుంచినట్టి శ్రీ -  కృష్ణుడు మనపై కృపతోనుండగ త..
కలియుగాంత్యమున కలిగిన దైవము - కలికిమూర్తి మము గాచుచు నుండగ త..
నారాయణదాసుని గాచిన శ్రీమన్‌ - నారాయణు నెరనమ్మియుండగ త..
రామదాసు నిల రక్షించెదనని - ప్రేమతో పలికిన ప్రభువిట నుండగ త..

pallavi:
takkuvaemi manaku raamuMDokkaDuMDuvaraku ta..
prakkatODugaa bhagavaMtuDu tana
chakradhaariyai cheMtane yuMDaga ta..
charaNamu(lu):
mruchchusOmakuni munujaMpinayaa - matsyamoorti manapakshamunuMDaga ta..
suralakoraku maMdaragiri mOsina - koormaavataaruni kRpa manakuMDaga ta..
duraatmuDau hiraNyaakshu druMchina - varaahamoorti manavaaDai yuMDaga ta..
hiraNyakaSipuni iruchekkalugaa - parachina narahari prakkana nuMDaga ta..
bhoomi svargamunu poMduga golichina - vaamanuMDu manavaaDai yuMDaga ta..
dharalO kshatriyulanu daMDiMchina - paraSuraamuni daya manakuMDaga ta..
daSagreevu munu daMDiMchina yaa - daSaratharaamuni daya manakuMDaga ta..
ilalO yadukulamuna nudayiMchina - balaraamuDu mana balamaiyuMDaga ta..
dushTakaMsuni druMchinaTTi Sree - kRshNuDu manapai kRpatOnuMDaga ta..
kaliyugaaMtyamuna kaligina daivamu - kalikimoorti mamu gaachuchu nuMDaga ta..
naaraayaNadaasuni gaachina Sreeman^ - naaraayaNu neranammiyuMDaga ta..
raamadaasu nila rakshiMchedanani - praematO palikina prabhuviTa nuMDaga ta..

No comments:

Post a Comment