YouTube link : Goshtiganam
పల్లవి: |
రామజోగి మందు కొనరే ఓ జనులార రా.. |
అను పల్లవి: |
రామజోగి మందుకొని ప్రేమతో భుజియించుడన్న కామక్రోధ లోభమోహ ఘనమైన రోగాలకు మందు రా.. |
చరణము(లు): |
కాటుక కొండలవంటి కర్మములెడబాపే మందు సాటిలేని జగమునందు స్వామి రామజోగిమందు రా.. |
వాదుకు చెప్పినగాని వారి పాపములు గొట్టి ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగిమందు రా.. |
ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు ముదముతో సేవించే మందు రా.. |
pa: cO janulaaraa || raama ||
a pa: raamajOgi maMdukoni - praematO bhujiyiMchuDanna
kaamakrOdha lObhamOha - ghanamaina rOgaalaku maMdu || raama ||
cha1: kaaTuka koMDalavaMTi - karmamuleDabaapae maMdu
saaTilaeni jagamunaMdu - svaamiraama jOgimaMdu || raama ||
cha2: vaaduku cheppinagaani - vaari paapamulu goTTi
mudamutOnae mOkshamichchae - muddu raamajOgimaMdu || raama ||
cha3: mudamutO bhadraadriyaMdu - muktini poMdiMchae maMdu
sadayuDaina raamadaasu - mudamutO saeviMchae maMdu || raama ||
No comments:
Post a Comment